నేటి అక్షరమే రేపటి దేశ యువ కిరణం

బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్

0
TMedia (Telugu News) :

నేటి అక్షరమే రేపటి దేశ యువ కిరణం

బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్

టీ మీడియా, జనవరి 27, వనపర్తి బ్యూరో : వసంత పంచమి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చ జిల్లా శాఖ అధ్వర్యంలో స్థానిక 20 వ వార్డ్ లోని గాంధీ నగర్లో అంగన్వాడీ స్కూల్ కేంద్రాలలో పిల్లలకి స్టడీ కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాకార్యదర్శి రాజ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నేటి పిల్లల క్రమశిక్షణ నే రేపటి తల్లి దండ్రుల ఔనత్యాన్ని పెంచుతుంది.బేధాభిప్రాయాలు లేకుండా పిల్లలు చదువు కోవాలని దేశంలో ప్రతి గ్రామ స్థాయి నుండి దేశం నలుమూలల వరకు పిల్లల చదువులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆనందంగా చదువు కోవాలి అనే ఉద్దేశ్యంతో తో రాబోవు కాలంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పద్ధతులతో విద్యను అభ్యసించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు ఇవ్వడం జరిగింది.

Also Read : ఘనంగా టీబీజికెఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎల్లపుడూ విద్యార్థులకు యువమోర్చా అండగా ఉంటదని వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవి ఆశీస్సులు అందరిపై ఉంటాయని స్కూల్ విద్యార్థులకు చెప్పడం జరిగింది. తదనంతరం స్కూల్స్ కిట్లనుఅందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, ఓబీసీ పట్టణ సోషల్ మీడియా కన్నా రవి సాగర్, బిజెపి నాయకులు శివ, అంజి తదితర యువ మోర్చ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube