పశుగ్రాసం తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధం

పశుగ్రాసం తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధం

1
TMedia (Telugu News) :

పశుగ్రాసం తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధం
టీ మీడియా, మే 14 ,రాజన్న సిరిసిల్ల: జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పశుగ్రాసం తరలిస్తున్న ట్రాక్టర్ కు విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైన పశుగ్రాసం ట్రాక్టర్. మండల కేంద్రానికి చెందిన చెక్కుటి రాజు అనే పాడి రైతు తన సొంత ట్రాక్టర్లో శుక్రవారం ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో పశుగ్రాసం తీసుకెళ్తుండగా ఎల్లారెడ్డిపేట, కిష్టంపల్లి గ్రామ శివారులో కరెంటు తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Also Read : ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ట్రాక్టర్ నిలిపివేసి స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా భారీగా మంటలు ఎగిసిపడడంతో పశుగ్రాసం తో సహా ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న యాజమాని సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర ఆవేదన గురయ్యాడు. ఇట్టి ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు లబోదిబోమన్నాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube