సాంప్రదాయ ఆహార పదార్థాలను వెలుగులోకి తీసుకురావాలి

0
TMedia (Telugu News) :

ప్రాచీనకాలంలో ఆదివాసీలు కొలిచే చెట్లకు పూజలు

ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్

టీ మీడియా,డిసెంబర్ 13,కరకగూడెం;

కరకగూడెం మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలో పాపాయి గూడెం గ్రామ నందు ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ ఆధ్వర్యంలో ప్రాచీన కాలంలో ఆదివాసీలు తీసుకున్న ఆహార పదార్థాలు,పంటలు విత్తనాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ మాట్లాడుతూ…
పాపాయిగూడెం,దేవర నాగారం రెండు గ్రామాల గ్రామ ప్రజల చేత ఆదివాసీలు కొలిచే దేవతలకు పూజలు చేశారు.
అనంతరం గ్రామస్థులు తయారు చేసిన 20 రకాలకు పైబడిన వంటలపై పూర్వంలో పూర్వీకులు ఏ విధమైన జీవనం కొనసాగించారో వారి పై ప్రత్యేకమైన,ఆదివాసీలు,గిరిజనులు ఆహార పదార్థాలు అడవుల్లో దొరికే దుంపలు,గడ్డలు,పండ్లు,ఆకు కూరలు పలు రకాల వంటకాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క దాని పై విద్యార్థులకు, గ్రామస్తులకు, యువతకు అభిరూచులు గురించి వివరించారు.

భవిష్యత్తులో ప్రాచీన ఆహారం పదార్థాలు తీసుకోవడం ద్వారా మానకు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉంటామని అన్నారు.
ఇంతటి మహా కార్యాన్ని శ్రీకారం చుట్టిన గ్రామ మహిళలకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ వారు కృతజ్ఞతలు తెలిపారు.

Traditional foods

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ, పంచాయతీ సెక్రెటరీ ఈసం నాగేశ్వరరావు,కోయ గిరిజన పరిశోధకులు పాయం రాజేందర్,తెరాస మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,
పోలెబోయిన సర్వేశ్వరరావు,మన్యం మనుగడ రిపోర్టర్ బట్టా బిక్షపతి,గ్రామస్తులు:గొగ్గల బాబురావు,పోలెబోయిన వెంకటేశ్వర్లు,ముత్యపురావు,నాగేశ్వర రావు,రత్తమ్మ,పద్మ,కృష్ణవేణి, శాంత, రెండు గ్రామాల మహిళలు పాల్గొన్నారు.

Traditional foods
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube