సామాజిక రుగ్మతలకు సాహిత్యం కళలే పరిష్కారం

జానపద కళల పరిశోధకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు

1
TMedia (Telugu News) :

సామాజిక రుగ్మతలకు సాహిత్యం కళలే పరిష్కారం

జానపద కళల పరిశోధకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు

టి మీడియా, ఎప్రిల్ 27,ఖమ్మం : సామాజిక రుగ్మతలకు సాహిత్యం కళలే పరిష్కారమని జానపద కళల పరిశోధకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు సూచించారు . మయూరి సెంటర్ కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ భవనంలో జరిగిన జమిలి సాహిత్య సాంస్కృతిక ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జమిలి సంస్థకు సంబంధించిన మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సామాజిక వ్యవస్థలో ముఖ్యంగా తెలుగు సమాజంలో ఒక శూన్యత ఏర్పడిందని దీన్ని పూర్తి చేయడానికి బదులుగా కమ్యూనిస్టులు , సోషలిస్టులు , ఎలక్షన్ పార్టీలు అన్నీ కూడా తమ బాధ్యతను విస్మరించి ప్రజలను నిర్వీర్యం చేస్తూ సామాజిక ద్రోహానికి పాల్పడుతున్నాయని ద్వజమెత్తారు. ఈ వర్తమాన నేపథ్యంలో ఒక సాంస్కృతి కవి ద్రోహాన్ని ఎండగట్టడానికి ఖాళీగా ఉన్న ఒక సామాజిక అనిశ్చితిని పూడ్చడానికి జమిలి సంస్థ పురుడు పోసుకోవడం కొంత విచిత్రంగానూ , ఆనందంగానూ ఉందన్నారు. ఈ కాలంలో వర్తమానాన్ని ఎదుర్కోవడానికి ఒక చక్కని భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక వేదిక అవసరం వచ్చిందని నిర్వాహకులు భావిస్తున్నారని తెలిపారు . అయితే ఇంతకు ముందు ఉన్న సంస్థలకు రాజకీయ పార్టీలు పెద్ద మనుషులు ఉన్నప్పటికీ బలహీనపడ్డాయన్నారు. సరిగా పని చేయలేక పోయాయి అన్నారు.

Also Read : ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అందుకు సంబంధించిన కారణాలను విశ్లేషించుకోవాలిసిన అవసరముందన్నారు. ప్రతిదీ మార్పు చెందుతుందన్నారు . ఆ మార్పు సిద్ధపడటం మానవ మేధస్సు యొక్క పని తనం అని పేర్కొన్నారు. మార్పు చేసే వారు కూడా ప్రజల పరిధి దాటి వెళ్ళిపోతూ ఉంటారు అన్నారు . అది సహజం , పరిణామ క్రమం యొక్క ప్రవాహ గుణం. దీనికి మనం అంగీకరించక తప్పదని తెలిపారు . అలా అంగీకరించినప్పుడు మనము ఆ సంస్థను మూల పునాదులను సవరించి నిర్మించగలమన్నారు . ఈ కార్యక్రమంలో జమిలి రాష్ట్ర కన్వీనర్ ఎల్. వెంకన్న , సమన్వయ కర్త కే.వీ సాకీ , స్పర్శ సామాజిక అధ్యయన వేదిక స్పర్శ భాస్కర్ , మారుతి రవి , సేవాలల్ సేన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ , తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగన్న , సీనియర్ జర్నలిస్టు ప్రముఖ కవి ప్రెషన్ , ప్రముఖ కవి సీతారాం , గిరిజన జేఏసీ చైర్మెన్ రాజేష్ నాయక్ , బహుజన వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్ , ములక సురేష్ , డాక్టర్ కెవి కృష్ణారావు , జంపాల విశ్వ తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube