లంచం తీసుకుంటూ బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై..

లంచం తీసుకుంటూ బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై..

0
TMedia (Telugu News) :

లంచం తీసుకుంటూ బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై..

-సస్పెండ్ చేసిన సీపీ

టీ మీడియా, జనవరి 6, హనుమ కొండ : రాష్ట్రమంతటా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంటే.. ఆ ట్రాఫిక్ ఎస్సై మాత్రం తన కలెక్షన్ల స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుల నుండి లంచం తీసుకున్న ఆ ట్రాఫిక్ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. అతను లంచం తీసుకుంటున్న వీడియో పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో వారి పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన హనుమకొండలో జరిగింది. హనుమకొండ ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న డేవిడ్ దర్జాగా లంచం తీసుకుంటూ ఒక వీడియోకిదొరికిపోయాడు.హనుమకొండలోని ములుగు రోడ్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆ మార్గంలో ఇద్దరు యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్నారు. కానిస్టేబుల్ వారిని పట్టుకొని సదరు ఎస్సై వద్దకు తీసుకొచ్చాడు. వారి పై చర్య తీసుకొని బుద్ది చెప్పాల్సిన ఎస్సై లంచానికి కక్కుర్తి పడ్డాడు.

Also Read : అంగన్వాడీలపై ఎస్మా

వాహ‌న‌దారుడి నుంచి లంచం తీసుకుంటుండగా అక్కడే బిల్డింగ్ పైన ఉన్న ఓ వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం తన సెల్ ఫోన్‎లో షూట్ చేశాడు. లంచం తీసుకుంటున్న వీడియో సిటీ పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌‎ను సస్పెండ్ చేస్తు వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లంచాల వ్యవహారంలో అతనికి సహరించిన కానిస్టేబుల్స్ పై కూడా విచారణ చేపట్టారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube