టీమీడియా,డిసెంబర్,4, భద్రాచలం
కరోనా ను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి పేర్కొన్నారు. శనివారం భద్రాచలం అయ్యప్ప స్వామి గుడి ముందు వాహనదారులకు కరోనా నియంత్రణపై అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని,మాస్క్ ధరిసై కరోనా నుండి రక్షణ పొందవచ్చు అనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది అన్నారు.ఈ సందర్భంగా మాస్క్ లేని 19 మందికి జరిమానా విధించారు.ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి అన్నారు.వాహన దారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానా లు చెల్లించాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.