ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలి.

0
TMedia (Telugu News) :

ఆటో డ్రైవర్ల కౌన్సిలింగు లో ట్రాఫిక్ ఎస్సై తిరుపతి

టి మీడియా,డిసెంబర్,14, భద్రాచలం

వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్ ప్రమాదాలు నివారించాలని,ఆటో డ్రైవర్లు అందరూ ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించి వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీపతి తిరుపతి కోరారు. మంగళవారం స్థానిక కణకదుర్గ అమ్మవారి గుడి వద్ద నున్న అటో అడ్డా కార్యలయం నందు అటో డ్రైవర్లకు కౌన్సిలింగు నిర్వహించారు. నిర్దేశించిన ధరల మేరకే ప్రయాణికులనుండి చార్జీలు తీసుకోవాలని సూచించారు. ఆటోలో సౌండ్ సిస్టమ్ లు ఉండరాదని, డ్రైవర్లు యూనిఫామ్ తప్పకుండా ధరించాలన్నారు.టాప్ నంబర్ కలిగి,అన్నీ రకాల అనుమతి పత్రాలు కలిగి ఉండాలని కోరారు.కరోనా నుండి కాపాడుకోవడానికి శానిటైజర్ వాడుతూ మాస్క్ ధరించాలన్నారు.అటో లో నిబంధనల మేరకే ప్రయాణికులను అనుమతించాలన్నారు.మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అని,ప్రతీ వాహనం పై ముందు,వెనుక భాగంలో నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ నాయకులు,ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube