అరుదైన పక్షులు, జంతువుల అక్రమ రవాణా..
టీ మీడియా, డిసెంబర్ 9,నాసిక్ : వన్యజాతికి చెందిన కొన్ని అరుదైన పక్షులు, జంతువులను అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడం కొందరు స్మగ్లర్లకు పరిపాటిగా మారింది. తాజాగా నాసిక్‌లో జరిగిన అలాంటి ప్రయత్నాన్నే అటవీ శాఖ అధికారులతో కలిసి జంతు సంక్షేమ సంఘాలు సంయుక్తంగా అడ్డుకున్నాయి. పక్షులు, జంతువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోగానే.. నిందితులు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. అధికారులు అందులోని పక్షులు, జంతువులను రక్షించారు. గాయపడిన కొన్ని పక్షలకు, జంతువులకు వైద్యం చేశారు. అనంతరం వాటిని వాటి సహజ ఆవాసాల్లో వదిలిపెట్టారు.