నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు

సి.పి చంద్రశేఖర్

1
TMedia (Telugu News) :

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు

-సి.పి చంద్రశేఖర్
టీ మీడియా,సెప్టెంబర్21,మంచిర్యాల ప్రతినిధి:వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం డి.సి.పి అఖిల్ మహాజన్ తో కలిసి కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం సీపీ గారు మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్ ల పరిధిలోని సీసీ కెమెరాలు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ సిస్టం తో కనెక్ట్ చేసినట్లు తెలిపారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్ చేసిన, సిగ్నల్ జంప్ చేసిన, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిగ్గా సిసి కెమెరాల ద్వారా ఈ చాలన్ ద్వారా జరిమానాలు పడతాయన్నారు.

Also Read : ఘనంగా పోషణ మాసోత్సవం

వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్,ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ మధుకర్, ఇన్స్పెక్టర్ శ్రీధర్, కమ్యూనికేషన్ అండ్ ఐటీ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube