గణేశ్‌ నిమజ్జనంలో విషాదం

ఒకరి మృతి, బాలిక గల్లంతు

1
TMedia (Telugu News) :

గణేశ్‌ నిమజ్జనంలో విషాదం

– ఒకరి మృతి, బాలిక గల్లంతు

టీ మీడియా, సెప్టెంబర్ 01, అమరావతి : ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలను జరుపుకున్న ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సాయినగర్‌ వాసులు గణేశ్‌ ఉత్సవాల అనంతరం పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఇవాళ నిమజ్జనం కోసం రాప్తాడు పండమేరు కాలువకు వెళ్లారు .

Also Read : తప్పిన ఘోర ప్రమాదం

నిమజ్జనం చేస్తుండగా నీటి ప్రవాహానికి నలుగురు నీటిలో పడిపోయారు. వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా శ్రీరాములు, జయశ్రీ అనే బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీరాములు లభ్యంకాగా గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube