తప్పిన పెను ప్రమాదం.. మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీ

53 మందికి గాయాలు

2
TMedia (Telugu News) :

తప్పిన పెను ప్రమాదం.. మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీ

-53 మందికి గాయాలు

టీ మీడియా, ఆగస్టు 17, ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును మరో రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్‌ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 53 మందిపైగా గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భగత్‌ కి కోఠీ ప్యాసింజర్‌ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తున్నది.

 

Also Read : ఫ్రీడంకప్ జిల్లా స్థాయి కి పోటీలకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని గోండియా సిటీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ గూడ్స్​ ట్రైన్‌ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 53 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube