రైలు నుండి ప్రమాదవశాత్తు కింద పడిన చిన్నారి

రైలు నుండి ప్రమాదవశాత్తు కింద పడిన చిన్నారి

0
TMedia (Telugu News) :

రైలు నుండి ప్రమాదవశాత్తు కింద పడిన
చిన్నారి

టీ మీడియా,సెప్టెంబర్ 27, పెద్దపల్లి : నిద్ర మత్తులో కదులుతున్న రైలు నుండి ప్రమాదవశాత్తు ఏడేళ్ల చిన్నారి కింద పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.తల్లి మౌనిక,కూతురు లావణ్య విజయవాడ నుండి సోమవారం రాత్రి బెల్లంపల్లి లోని చర్చ్ కి వెళ్తున్నారు.ఈ క్రమంలో నిద్రమత్తులో చిన్నారి లావణ్య వాష్ రూం వెళ్తూ బాత్ రూం డోర్ అనుకుని రైలు ప్రధాన ముఖద్వారం తెరిచి ముందుకు అడుగు వేయగానే కింద పడి పోయింది.

Also Read : నన్ను వ్యభిచారి అంటావా? బుద్ధుందా నీకు?

గమనించిన ప్రయాణికులు.రైలు‌ను చీకురాయి సమీపంలో నిలిపి వేసి 108 కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి కానిస్టేబుల్ శరత్ చేరుకొని తీవ్ర గాయాలతో ఉన్న లావణ్యను 108 అంబులెన్స్ లో మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube