నిరుద్యోగులకు శిక్షణ లు ఏర్పాటు చేయాలి
-స్కిల్ డౌలప్మెంట్ కమిటీ లో కలెక్టర్
టి మీడియా, మే 11,భద్రాద్రి కొత్తగూడెం:
నిసుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు వృత్తి నైపుణ్యతా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్కిల్ డవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం సంకల్ప కార్యక్రమం ద్వారా జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుటకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆయా శాఖల ద్వారా ఉపాధి కల్పనకు అవకాశం ఉన్న అంశాలపై నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ముక్యంగా వ్యవసాయ రంగంలో అధునాతన పరికరాలు ఉపయోగం చాలా ఉన్నదని చెప్పారు.
Also Read : భారీ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్ల పెంపు
వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ద్వారా చేపడుతున్న వృత్తి నైపుణ్య కార్యక్రామాలను పరిశీలన చేయాలని చెప్పారు. వృత్తి నైపుణ్య కార్యక్రామాలను మన జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఆ ప్రకారం కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.
నర్సరీల్లో మొక్కలు డ్రాఫ్టింగ్, బోన్సాయ్ మొక్కలు పెంపకం వంటి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు కు పరికరాలు కొనుగోలు చేయుటకు కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు.
ప్రాజెక్టు సంకల్ప పై ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ శాఖ ఏడి రవికుమార్, ఐటిడిఎ జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.