మాతృమూర్తులకు శిక్షణ

మాతృమూర్తులకు శిక్షణ

1
TMedia (Telugu News) :

మాతృమూర్తులకు శిక్షణ

టీ మీడియా, డిసెంబర్ 6, జన్నారం : మండలంలోని పొనకల్ గ్రామంలో గల స్లేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, పిల్లల మార్తృమూర్తులకు మంగళవారం రోజున మాతృదేవోభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోనకల్ సర్పంచ్ జాక్కు భుమేష్, శ్రీనివాస్ రెడ్డి వేదం గ్రూప్ ఆఫ్ హై స్కూల్ చైర్మన్ ఫెసిలిటేటర్ గా వ్యవహరించి మాతృమూర్తులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో పిల్లలు ఉన్నత స్థానానికి చేరుకొని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలంటే తల్లి యొక్క సహకారం అత్యవసరమని భావించి ,పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు బాడీ బ్రెయిన్ కి ఎలా శిక్షణ ఇవ్వాలో పిల్లల తల్లులకు ఉదయం 10:00 నుండి 4 గంటల వరకు శిక్షణ ఇచ్చారు.

Also Read : ఉజ్జ‌యిని మ‌హంకాళేశ్వ‌ర్ ఆల‌యంలో ఫోన్ల‌పై నిషేధం

శిక్షణతో పాటు న్యూట్రిషన్లు కలిగిన పౌష్టిక తినుబండరాలను తల్లులకు తీసుకువచ్చి అందరికీ తినిపించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు ఏనుగు సుభాష్, రెడ్డి ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి, ఏనుగు రజిత, అకాడమీ డైరెక్టర్ అనూష ,ఉపాధ్యాయులు, మాతృమూర్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube