విద్యార్థులకు దేశభక్తి గేయాలపై శిక్షణ

విద్యార్థులకు దేశభక్తి గేయాలపై శిక్షణ

0
TMedia (Telugu News) :

విద్యార్థులకు దేశభక్తి గేయాలపై శిక్షణ

టీ మీడియా, ఫిబ్రవరి 15, వనపర్తి బ్యూరో : అక్షర దీక్ష కార్యక్రమం 15వ బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనిగిల్లలో విద్యార్థులందరూ దేశభక్తి గేయాలను నేర్చుకున్నారు. ప్రముఖ సంగీతం మాస్టారు పాండురంగయ్య బుధవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు వివిధ దేశభక్తి గేయాలను పాడడంలో శిక్షణను ఇచ్చారు. కీబోర్డ్ పై విద్యార్థులకు పాటలు పాడించడం చూపించారు. ఇలాంటి పాటలు నేర్చుకోవడం వల్ల విద్యార్థులలో దేశభక్తి భావాలు పెంపొందించవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంగీతం మాస్టారు పాండురంగయ్యని విద్యార్థులు శాలువా మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్ల ప్రధానోపాధ్యాయులు పి శంకర్ గౌడ్, ఉపాధ్యాయులు విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సై కి సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube