కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!

కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!

1
TMedia (Telugu News) :

కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!

టీ మీడియా, మార్చి 31ముంబై :నజరియా’ కెఫేలో చాయ్‌ బిస్కెట్ల నుంచి భోజనాల వరకూ రకరకాల వంటకాలు సిద్ధంగా ఉంటాయి. ఎల్‌జీబీటీ సహా క్వీర్‌ కమ్యూనిటీకి చెందిన ఎంతోమంది ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటారు. సాధారణ పౌరులూ వస్తుంటారు. కాలక్షేపానికి చిన్న గ్రంథాలయం కూడా ఉంది. అందులో ఎన్నో సందేశాత్మక పుస్తకాలు ఉంటాయి. గోడల మీద ‘ప్రేమగా ఉండండి.. ప్రేమను పంచండి’ తరహా సందేశాలూ ఆలోచింప జేస్తాయి. ఈ కెఫేను డిగో మిరాండా, గ్లెనిస్‌ డి అనే ట్రాన్స్‌జెండర్స్‌ ఏర్పాటు చేశారు.

ALSO READ;8 వ‌ర‌కు నాంప‌ల్లి నుమాయిష్..

ఇక్కడ పనిచేసే ఉద్యోగులంతా ట్రాన్స్‌జెండర్సే.పింక్‌ చాయ్‌, చీజ్‌ క్రోసెంట్‌, చికెన్‌ పెప్పరోనీ ప్రత్యేక వంటకాలు. పావ్‌ బాజీ, కీమా పావ్‌, మిసల్‌ పావ్‌ వంటి పక్కా ముంబై రుచులూ లభిస్తాయి. ముంబై నడిగడ్డలో ఓ కెఫే. దానిని ట్రాన్స్‌జెండర్స్‌ నిర్వహిస్తున్నా.. అందులో అడుగుపెడితే చాలు, మానవత్వపు పరిమళాల గుబాళింపే. అక్కడ అంతా సమానమే. ఎలాంటి లింగభేదాలు లేవు. ‘బంబై నజరియా’ గురించి ఇప్పుడు ముంబై మాత్రమే కాదు.. దేశం మొత్తం మాట్లాడుకుంటున్నది.

ALSO READ;మండిపోతున్నఎండలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube