ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టకు 415 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయండి
– ఢిల్లీ సర్కారును ఆదేశించిన సుప్రీంకోర్టు
టీ మీడియా, నవంబర్ 21, న్యూఢిల్లీ : వాణిజ్య ప్రకటనల కోసం కేటాయించిన నిధుల్లోని సుమారు రూ.415 కోట్లును ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టుకు బదిలీ చేయాలని ఢిల్లీ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషణ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వారం రోజుల లోగా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయకుంటే, అప్పుడు ఈ ఆదేశాల్లో తక్షణమే అమలులోకి వస్తాయని జస్టిస్ సంజయ్ తెలిపారు. తమ ఆదేశాలను తప్పకుండా పాటించాలని ధర్మాసనం తెలిపింది. ఆ బెంచ్‌లో జస్టిస్ సుధాన్షు దులియా ఉన్నారు. గత మూడేళ్ల నుంచి ఢిల్లీ ప్రభుత్వం అడ్వర్టేజ్మెంట్ల కోసం 1100 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది 550 కోట్లు కేటాయించింది. అయితే ఆ నిధుల నుంచి కొంత భాగాన్ని సెమీహైస్పీడ్ రీజినల్ రెయిల్ సర్వీస్ ప్రాజెక్టుకు కేటాయించాలని కోరుతూ సుప్రీం ఆదేశించింది. ఢిల్లీ, మీరట్, అల్వార్, పానిపాట్ కోసం ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే.
Also Read : బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టును చేపట్టారు. అడ్వర్టేజ్మెంట్ కోసం ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారని, ఆ నిధుల నుంచి 415 కోట్లను ఆర్ఆర్టీఎస్‌కు రెండు నెలల్లో ఇవ్వాలని జూలై 24వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube