ఢిల్లీ కౌన్సిల‌ర్‌గా ఎన్నికైన ట్రాన్స్‌జెండ‌ర్

ఢిల్లీ కౌన్సిల‌ర్‌గా ఎన్నికైన ట్రాన్స్‌జెండ‌ర్

1
TMedia (Telugu News) :

ఢిల్లీ కౌన్సిల‌ర్‌గా ఎన్నికైన ట్రాన్స్‌జెండ‌ర్

టీ మీడియా, డిసెంబరు 7, న్యూఢిల్లీ : ఢిల్లీలో జ‌రిగిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ట్రాన్స్‌జెండ‌ర్ బాబీ కిన్నార్ గెలిచింది. ఎంసీడీ ఎన్నిక‌ల్లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కౌన్సిల‌ర్‌గా ఎన్నిక కావ‌డం ఇదే తొలిసారి. ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున సుల్తాన్‌పూర్ మ‌జ్రా వార్డు నుంచి బాబీ ఎన్నికైంది. బీజేపీకి చెందిన ఏక్తా జాత‌వ్‌పై ఆమె గెలుపొందారు. 2017లో కూడా ఆమె ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. కానీ ఆ ఏడాది ఆప్ నేత సంజీవ్ కుమార్ చేతుల్లో ఆమె ఓడిపోయారు. రోడ్లు, పార్క్‌ల వ‌ద్ద చెత్త చేరుకుపోయింద‌ని, ఈ న‌గ‌రాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. 2011లో అన్నా హ‌జారే ఉద్య‌మం చేప‌ట్టిన నాటి నుంచి ట్రాన్స్‌జెండ‌ర్ బాబీ రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు.

మాజీ అధ్యక్షుడి ముఖంపై పంచ్‌

ఆమ్ ఆద్మీ పార్టీకి ఆమె మ‌ద్ద‌తు ఇస్తూనే ఉన్నారు. 2017లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన‌ప్పుడు మంచి స‌పోర్ట్ వ‌చ్చింద‌న్నారు. 15 ఏళ్ల నుంచి స‌మాజ సేవ‌లో ఉన్నాన‌ని, అందుకే త‌న‌కు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube