దళిత బంధు దళారీలకు బిగిస్తున్న ఉచ్చు

నియోజకవర్గ వ్యాప్తంగా ఆశావాహులు తిరుగుబాటు

0
TMedia (Telugu News) :

దళిత బంధు దళారీలకు బిగిస్తున్న ఉచ్చు

– నియోజకవర్గ వ్యాప్తంగా ఆశావాహులు తిరుగుబాటు

– గడువు కోరుతున్న నాయకులు

టీ మీడియా, డిసెంబర్ 5, అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దళిత బంధు పథకం ఆ పార్టీని కొంప ముంచిందని చెప్పకనే చెప్పవచ్చు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు మాట అటు ఉంచితే రానివారే తిరుగుబాటు చేసి బారాస ప్రభుత్వం ఓటమిలో ఓ భాగమయ్యారు. ఇది 100% వాస్తవం ఇదిలా ఉండగా ఒక్కొక నియోజకవర్గానికి ఎన్నికల ముందు 1100 మందికి ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించగా అశ్వారావుపేట నియోజకవర్గం లో లబ్ధిదారులను గుర్తించాల్సి ఉండగా ఇదే అదునుగా చేసుకొని కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు అన్ని మండలాల్లో దళితుబందులో దళారులు గా తయారయ్యారు.ఎన్నికలలో గెలిచేది మనమేనని వచ్చేది మన ప్రభుత్వమేనని వారిని నమ్మబలికి కమిషన్ల పర్వానికి తేరలేపారు. ఒక్కొక్కరి వద్ద నుండి లక్ష రూపాయల నుంచి 3 లక్షల వరకు తీసుకున్నారని సమాచారం. ఒక్కొక్కరి వద్దనుండి అయితే ఏకంగా బ్యాంకు చెక్కులు కూడా తీసుకున్నారు. ఒక పూల కొట్టి వ్యాపారి అయితే లక్ష రూపాయలు నగదు చెల్లించి రెండు లక్షల రూపాయలు బ్యాంక్ చెక్ ని అందించినట్లు కీలక సమాచారం.కొంతమంది ఆటోలను తాకట్టు పెట్టి డబ్బులు కట్టినట్లు తెలుస్తుంది మరి కొంతమంది వడ్డీలకు తీసుకొని నాయకుల మాటలను నమ్మి అడ్వాన్సులు ఇచ్చారని మిగిలినవి పథకం మంజూరయ్యాక అందులో మినహాయించుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.

Also Read : అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం

దీనంతటికీ కారణం బారాస నాయకుల అతి విశ్వాసమే వారి మెడకు ఈ స్కాం చుట్టుకుంది. అమాయకమైన దళిత యువకులకు మాయ మాటలు చెప్పి మీకు దళితబందు వస్తుందని మీ కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో మా పార్టీ వైపు తిరగాలని హుకుం జారీ చేసి మరి ఎన్నికలలో తమ వైపు తిప్పుకున్నారని కొంతమంది బాహటంగానే అంటున్నారు. నియోజవర్గంలోని అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో సుమారు 141 మంది ఆశావాహులు నాయకులకు డబ్బులు చెల్లించి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నారంటే ఒక అశ్వారావుపేటలోని 30 మంది ఉన్నారంటే ఈ స్కాం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గానికి 1100 మందిని దళిత బంధు పథకంకు కేటాయించగా ఆయా మండలాల్లో నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి అమాయకమైన దళితులను ఎన్నికలలో పావులుగా వాడుకున్నారు. ఇప్పుడు ఫలితాల అనంతరం కథ అడ్డం తిరిగింది.ఎన్నికల ఫలితాలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్క దళిత బంధు పథకాన్ని ముగ్గురు నలుగురు నాయకులు పంచుకోవడంతో ఆ డబ్బులు మరలా వెనక్కి ఏ విధంగా ఇవ్వాలో తెలియక వారిలో వారికి సఖ్యత కుదరక చిలికి చిలికి గాలివాన అయ్యే పరిస్థితి నెలకొంది.

Also Read : తెలంగాణకు రెడ్ అలెర్ట్..

ఎవరైతే దళిత బంధు ఆశావాహులు ముందుగానే పైకంను చెల్లించారో వారందరూ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయా నాయకులను కలవగా వారు కొంత సమయం అడిగారని తెలుస్తుంది.ఆ సమయం వరకు చూసి లేనియెడల వారిపై తమ వద్ద ఉన్న ఆధారాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు కీలక సమాచారం. చూడాలి ఈ స్కాం నుండి బారాసా నాయకులు ఏ విధంగా బయటపడతారో.?
ఈ స్కాములు ఈ ఒక్క పథకానికైనా మిగిలిన పథకాలపై కూడా కొనసాగిందో తెలియాలి అంటే మరో కథనంలో కలుద్దాం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube