మెచ్చాకు బిగుస్తున్న ఓటమి ఉచ్చు
– దమ్మపెట, అశ్వారావుపేట మండలాల్లో అసమ్మతి
– ముల్కలపల్లి లో ముఠాతత్వం
– సరిచేసుకొకపోతే తప్పదు ముప్పు
టి మీడియా, నవంబర్ 18, అశ్వారావుపేట : అత్యంత సౌమ్యుడు, ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే గా పేరున్న అశ్వారావుపేట బి ఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు కు ఉచ్చు బిగించే విధంగా కొంత మంది సొంతపార్టీ నాయకుల వ్యవహార శైలి ఉంది. ఎమ్మెల్యే ప్రత్యేక కృషి ఫలితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఎంపి నామ నాగేశ్వరరావు తో ఉన్న సాన్నిహీత్యం వినియో గించుకోని మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం నుండి వచ్చే ఈ.జి.ఎస్ నిధులు, ఎంపి ల్యాడ్ లు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీ నిధు లు తెచ్చారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా లో అశ్వారావుపేట నియోజక వర్గంలో ఎన్నడూ లేని విధంగా పోడు భూములకు పట్టాలు ఇప్పించారు.ఇతర సంక్షేమ పథకాలు విషయము లోనూ చెప్ప నక్కర లేదు.ఇటువంటి అనేకం చేసిన ఆయన గెలుపు ఈ ఎన్నికల్లో సునాయాసం అనే అభిప్రాయం అభ్యర్థిగా ప్రకటన వచ్చినప్పుడు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు .
Also Read : ధరణిపోతే దళారీ దందా.. కాంగ్రెస్ ను నమ్మితే అధోగతే..
ఇప్పుడు అదే విశ్లేషకులు ఓటమి వైపు మెచ్చ వెళుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు అనేకం చెపుతున్నారు.ప్రత్యర్థి కంటే బలమైన పునాది కలిగిన ఎమ్మెల్యే కి మచ్చ తెస్తున్నారు కొందరు బి అర్ ఎస్ నాయకులు, వారి మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ అయింది అంటున్నారు.వచ్చిన నిధులు తో పనులు చేసిన వారు జనం గురించి,కనీసం క్యాడర్ గురించి పట్టించు కొక పోగా ఎమ్మెల్యే నీ నేరుగా కలవనేయకుండ చేస్తున్నారని ,ఏమి కావాలి అన్నా మమ్మ ల్ని సంప్రదించాలి అని అంటున్నారని బిఆర్ఎస్ ద్వితీయ స్థాయి శ్రేణులు కొంత మంది భాహిరంగం గానే వ్యాఖ్యానించటం గమనార్హం. ఎమ్మెల్యే కూడా కొన్ని సందర్భాల్లో వారి మాటలు వింటు న్నారు అని పేర్కొంటున్నారు.దళిత బందులో అవకతవకల పై వచ్చిన ఆరోపణలు కొంతమంది నేతలు పై ఆర్థిక ఆరోపణలు అశ్వారావుపేట బి అర్ ఎస్ లో అసమ్మతి కి కారణం అయ్యి పార్టీ మండల అధ్యక్షలు గా ఉన్న సీనియర్ నాయకుడు రాజీ నామా కు దారి తీసింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందిన,పొందుతున్న కొంతమంది గ్రూప్ గా ఏర్పడి తమ ఇస్టాను సారంగా వ్యహరిస్తు,మరెవ్వరిని నాయకత్వ స్థాయి లోకి రాకుండా చెయ్యటం, మెచ్చావద్ద లాబియింగ్ లు చేస్తున్నరు అనే ఆరోపణలు ఉన్నయి.వీరు చెప్పిందే ఎమ్మెల్యే చేస్తున్నరు అన్న విమర్శ ఉంది. దమ్మపెట లోని నేతలు రెండుగా చీలి పోయారు.పలు సందర్భాల్లో అక్కడి పార్టి నేతలు మధ్య విబేధాలు బహిర్గతం అయ్యాయి కూడా,వీరి విబేధాలు బిఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపక మానదని అదే విధంగా ముల్కలపల్లి మండలంలో మూడు గ్రూప్ లుగా బిఆర్ఎస్ అయిందని అక్కడీ నేతలు బహిరంగ విమర్శలు అనేక సందర్భాల్లో చేసుకొన్నారు.
Also Read : మోసపు మాటలు నమ్మి ఆగం కావొద్దు
కాంట్రాక్టు ల గొడవలు అక్కడ తీవ్ర స్థాయి లో ఉన్నాయి. నాయకత్వ స్థాయిలో అక్రమ కలెక్షన్స్ ఆరోపణలు ఉన్నాయి. చండ్రు గొండ లో నీ ఓక ప్రజా ప్రతినిధి పార్టి లో ఉన్న ఉన్నత స్థాయి నాయకులతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఉపయగించి భారీ ఫైరవీలకు తెగ బడ్డరనే ఆరోపణలు ఉన్నాయి. ఇతని వ్యవహారము పై గుర్రుగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేక పోవడం తో తీవ్ర అసంతృప్తి తో కొంతమంది ఉన్నారు. నియోజవర్గ వ్యాప్తంగా ఇటువంటి అనేక విషయాలు మెచ్చాకు ఓటమి ఉచ్చుకు చేరువ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. (మెచ్చా కి అంటుకొన్న అవినీతి మచ్చ, మరో కధనం లో)
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube