పర్యావరణాన్ని పరిరక్షించడం మానవ కర్తవ్యం

పర్యావరణాన్ని పరిరక్షించడం మానవ కర్తవ్యం

0
TMedia (Telugu News) :

లక్షెటిపేట

టి మీడియా జూన్ 05 లక్షెట్టిపేట

నిత్యజీవితంలో పర్యావరణాన్ని పరిరక్షించడం
మానవుని కర్తవ్యమని
లక్షెటిపేట జూనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షెట్టిపేట మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆదివారం జడ్జి న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ……. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత సాధ్యం అని అన్నారు. అడవులు నరకడం ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంలో కాలుష్యం పెరిగి క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగం ప్రభలుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.పర్యావరణ పరిరక్షణలో న్యాయవాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్ స్పోర్ట్స్ సెక్రటరీ వేల్పుల సత్యం న్యాయవాదులు కేతిరెడ్డి భూమరెడ్డి అక్కల శ్రీధర్ రెడ్డిమల్ల ప్రకాశం చాతరాజు శివశంకర్ మంచాల సదాశివ ఫారెస్ట్ రేంజ్ అధికారి నగావత్ స్వామి డిప్యూటీ రేంజ్ అధికారి అజహార్ కోర్టు సిబ్బంది రాంరెడ్డి నీరజ యశోధర పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube