గిరిజన భవన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

పాల్గోన్న మంత్రిసత్యవతి, ఎంపీ లు, ఎమ్మేల్యేలు

1
TMedia (Telugu News) :

గిరిజన భవన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

-పాల్గోన్న మంత్రిసత్యవతి, ఎంపీ లు, ఎమ్మేల్యేలు

టి మీడియా,జులై 8,భద్రాచలం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రూ. 1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్ గారు..ఆనంతరం గిరిజన భవన్ లో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలక మండలి సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ, సత్యావతి పాల్గోన్నారు.

Also Read : విస్తారంగా కురుస్తున్న వానలు

ఐటీడీఏ పీఓ భద్రాచలం అధ్యక్షతన ఎర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం, మహబుబాబాద్ ఎంపీ లు నామా నాగేశ్వర రావు , మాలోత్ కవిత గారు, ఎమ్మెల్సీ తాతా మధు , ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు గౌతం , అనుదీప్ , ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య , పోదెం వీరయ్య గారు, వనమా వెంకటేశ్వరరావు , మెచ్చా నాగేశ్వర రావు , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , కొత్తగూడెం, మహబుబాబాద్ జిల్లాల జడ్పి చైర్మన్లు కొరం కనకయ్య , బిందు , వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube