అంధకారంలో అబ్బీపురం గ్రామంలోని గిరిజన కాలనీ
టీ మీడియా, మే 25, మహానంది:
మహానంది మండల పరిధిలోని అబ్బీపురం గ్రామంలో 42 గిరిజన కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని ఆ గిరిజన కాలనీలో విద్యుత్ అధికారులు విద్యుత్తు మీటర్ లేవని సాకు తో కరెంట్ కట్ చేసి అంధకారంలో గిరిజన కాలనిని చేయడం అమానుషమని వెంటనే ఆ గిరిజన కాలనీలో విద్యుత్తునుపునరుద్ధరించాలని సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్. సిపిఐ మహానంది మండల కార్యదర్శి ఆర్ సామేలు. ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Also Read : ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుండి ప్రతిపాదనలకు ఆహ్వానం
అబ్బీపురం గ్రామంలో42 గిరిజన కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని అక్కడ రోడ్లు గాని. వీధి కాలువలు గాని. వీధిలైట్లు కనీస వసతులు కూడా లేకుండా విష పురుగులు తిరుగుతున్న వాటి మధ్య గిరిజనులు వారి పిల్లలు జీవించడం జరుగుతుందని ఎన్నోసార్లు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు అధికారులు వ్యవహా రించడం దారుణమని ఇప్పుడు మూలిగే నక్కపై తాటి కాడ పడ్డ చందంగా విద్యుత్ అధికారులు కూడా కరెంటు కట్ చేయడం దుర్మార్గమైన చర్య అని వెంటనే గిరిజన కాలనీలో విద్యుత్తునుపునరుద్ధరించాలని లేనిపక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube