మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన గిరిజ‌న మ‌హిళ‌లు

మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన గిరిజ‌న మ‌హిళ‌లు

0
TMedia (Telugu News) :

మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన గిరిజ‌న మ‌హిళ‌లు

టీ మీడియా, ఫిబ్రవరి 4, వైరా : నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్ లాల్ కు తొడితలగూడెం, పంతులు నాయక్ తండాలోని గిరిజ‌న మ‌హిళ‌లు దిమ్మ‌ తిరిగే షాకిచ్చారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే మీకు ఏం చేశాడ‌ని ప్ర‌శ్నించ‌డంతో కోపంతో ఊగిపోయిన గ్రామ‌స్తులు, గిరిజ‌న మ‌హిళ‌లు మీరు ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఏం చేశార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఏం చేయాలో తెలియ‌క మాజీ ఎమ్మెల్యే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కారేప‌ల్లి మండ‌లంలోని తొడితలగూడెం, పంతులు నాయక్ తండా పర్యటనలో భాగంగా వైరా మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్ లాల్ అధికార పార్టీ నాయకుడు అని చెప్పుకుంటూ.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే మీకు ఏం చేశాడని విమర్శలు చేసే క్రమంలో స్థానిక గ్రామస్తులు, మహిళలు మాజీ ఎమ్మెల్యే పై విమర్శలు గుప్పించారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏనాడైనా మా గ్రామానికి వచ్చారా?,

Also Read : కన్నుల పండువగా శ్రీ లక్ష్మినరసింహ స్వామి కల్యాణోత్సవం

మా గ్రామానికి ఏదైనా నిధులు కేటాయించారా?, ఇప్పుడు మీరు వేరే గ్రామాల నుండి జనాలను తీసుకొస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మారు మూల గ్రామమైనా మా గ్రామాన్ని ఎన్నో సార్లు సందర్శించారని, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇంకా ఎన్నో అభివృద్ధికి కార్యక్రమాలకు సహకరిస్తున్నారని వారు మాజీ ఎమ్మెల్యేకి దిమ్మ తిరిగే సమాదానాలు చెప్పారు. ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో మ‌ద‌న్ లాల్ పర్యటనను రద్దు చేసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube