మామయ్య కృష్ణకు నమ్రత శిరోద్కర్ నివాళి.. ట్రెండింగ్‌లో వీడియో
మామయ్య కృష్ణకు నమ్రత శిరోద్కర్ నివాళి.. ట్రెండింగ్‌లో వీడియో
మామయ్య కృష్ణకు నమ్రత శిరోద్కర్ నివాళి.. ట్రెండింగ్‌లో వీడియో
టీ మీడియా, నవంబర్ 27 :
ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులు, అభిమానుల నుంచి భౌతికంగా దూరమైన విషయం తెలిసిందే. కృష్ణ మరణం పట్ల టాలీవుడ్‌తోపాటు యావత్ సినీ లోకం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కాగా కృష్ణకు ఆయన కోడలు నమ్రతా శిరోద్కర్ ఘనంగా నివాళులర్పించింది. కృష్ణ సినీ ప్రయాణం, మైలురాళ్లు, రికార్డులతో డిజైన్ చేసిన రీల్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది నమ్రతా శిరోద్కర్. ఈ వీడియో చూసిన అభిమానులు, ఫాలోవర్లు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో కృష్ణ జ్ఞాపకార్థం ఘట్టమనేని కుటుంబసభ్యులంతా కలిసి మెమోరియల్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మెమోరియల్‌కు సంబంధించిన వివరాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మెమోరియల్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంతోపాటు ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, ఇతర విశేషాలు అందుబాటులో ఉండనున్నాయి. మెమోరియల్‌ను పద్మాలయ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోండగా.. పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
https://www.instagram.com/p/Clc9-O9ACDy/
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube