సిపిఎం కార్యకర్త పూర్ణచంద్రరావు మృతికి నివాళులు

సిపిఎం కార్యకర్త పూర్ణచంద్రరావు మృతికి నివాళులు

1
TMedia (Telugu News) :

సిపిఎం కార్యకర్త పూర్ణచంద్రరావు మృతికి నివాళులు

టీ మీడియా,అక్టోబర్.20,ముదిగొండ : మండలపరిధిలో గోకినేపల్లి గ్రామానికి చెందిన సిపిఐ(ఎం) సీనియర్ కార్యకర్త పయ్యావుల పూర్ణచంద్రరావు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలుపాలై బుధవారం మృతిచెందారు. సిపిఐ(ఎంఎల్ ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పిఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి కట్టా రమాదేవి, సిపిఐ(ఎం) జిల్లా జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, పూర్ణచందర్రావు భౌతికగాయాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. పూర్ణ చందర్రావు మృతికి సంతాపం వ్యక్తంచేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వారు తెలిపారు.

Also Read : ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

మృతుడు పూర్ణచంద్రరావుకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. పూర్ణచందర్రావు అంత్య క్రియలతోపాటు సంతాపసభ గురువారం జరగనున్నట్లు పార్టీ గ్రామశాఖ తెలిపింది. ఈ సంతాపసభకు సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, సిపిఐ(ఎం) మండల నాయకులు పయ్యావుల రామనాథం,ఐద్వా మండల ప్రధాన కార్యదర్శి పయ్యావుల ప్రభావతి,సిపిఐ (ఎం) గ్రామశాఖ కార్యదర్శి మేడా నారాయణ, నాయకులు కృష్ణసాగరపు సత్యం, బొడ్డు శ్రీను, బండి శ్రీను, తోర్తి సైదులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube