గాంధీ కి ఘన నివాళి

గాంధీ కి ఘన నివాళి

1
TMedia (Telugu News) :

గాంధీ కి ఘన నివాళి
-కుటుంబంకు జర్నలిస్ట్ ల అండ

టి మీడియా, జులై 9,ఖమ్మం: టి మీడియా కార్యలయం లో శనివారం సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్, న్యాయవాది గాంధీ సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు శనగపాటి మురళీ కృష్ణ,నామ పురుషోత్తం, చక్రవర్తి ,టి మీడియా సిబ్బంది ఎస్ శ్రీ రమ,కల్యాణ్ జి నరేశ్,సంధ్య పాల్గొన్నారు. జర్నలిస్ట్ గా గాంధీ చేసిన సేవలు కొనియాడారు. సమస్య ఎక్కడ ఉంటే పరిష్కరం అక్కడ ఉంది అని నమ్మిన వ్యక్తి అన్నారు.తన దెగ్గరికి ఎంతటి సమస్య ఇబ్బంది తో వచ్చిన ప్రతి ఒక్కరికీ చేతనైనంత సాయం చేసే స్వభావం కలిగివున్న వ్యక్తి అన్నారు.

Also Read : వీలునామా అంటే ఏమిటి తెలుసుకుందాం

గాంధీ కుటుంబం కు ఏళ్ల వేళలా జర్నలిస్ట్ లు అండగా ఉంటారని అన్నారు.అందరూ బాగుండా లి అందులో తాను లేక పోయినా పర్వాలేదు అనే గాంధీ విధానం ముందుకు తీసుకు పోయేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయడం గాంధీ కి అర్పించే నిజమైన నివాళి అన్నారు.గాంధీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube