జమీర్ జర్నలిస్టుకు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆశ్రునివాళి

క్లబ్ ఆధ్వర్యంలో క్యాండిల్ తో ఘనంగా నివాళులు

1
TMedia (Telugu News) :

జమీర్ జర్నలిస్టుకు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆశ్రునివాళి

– క్లబ్ ఆధ్వర్యంలో క్యాండిల్ తో ఘనంగా నివాళులు

– 10 లక్షలు ఎక్స్గ్రేషియా విద్య,వైద్యం అందించాలి

-ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్

టి మీడియా,జూలై16,క్యాతనపల్లి: జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ స్వర్గీయ మహమ్మద్ జమీరుద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం క్యాతనపల్లి259 ఆఫ్19 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అశ్రు నివాళులు అర్పించారు.ఆ సందర్భంగా క్లబ్బు ఆఫీసులో ఆ రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అమర్ హై..అమర్ హై జమీర్ అమర్ హై అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.అలాగే క్యాండిల్ వెలిగించి ఆ జర్నలిస్టు మృతిని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం కూడా పాటించారు.ఆ సందర్భంగా క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్, కోశాధికారి రామిళ్ళ శ్రీనివాస్ మాట్లాడారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న ఆ జర్నలిస్టుల సేవలను గుర్తుచేశారు.ఆ నేపథ్యంలోనే జమీర్ జర్నలిస్టు మిత్రుడు కవరేజ్ కి వెళ్లి ఉప్పొంగిన రామోజీ పేట వాగులో కారుతో సహా గల్లంతు అయినట్లు పేర్కొన్నారు. దాంతో మిత్రుని ఆత్మకు శాంతి చేకూరాలని అతని కుటుంబానికి న్యాయం చేయాలని ఆ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధాన వీధి గుండా ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్ణయించినట్లు వివరించారు.

 

Also Read : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు పెంపు

అలాగే రాష్ట్ర ప్రభుత్వం మృతుని కుటుంబానికి టి మీడియా,జులై16,రామ10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ మృతుని కుటుంబంలోని సభ్యులకు విద్యా వైద్య రంగంలో ఉచితంగా సహాయ సహకారాలు అందించాలని వివరించారు.అలాగే డబుల్ బెడ్ రూమ్ లేదా ఇళ్ల స్థలం ఇవ్వాలని దాతలు రాజకీయ నాయకులు కూడా ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో క్యాతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలువల శ్రీనివాస్ తో పాటు ట్రెజరర్ రామిళ్ళ శ్రీనివాస్,ఆ ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టులు నవ తెలంగాణ శ్రీనివాస్,తూముల భవిష్యత్తు,పరికిపండ్ల రాజు,వేల్పుల కిరణ్ కుమార్, చొప్పదండి జనార్ధన్,కే.శ్రీనివాస్, కృష్ణమూర్తి,చొప్పదండి తిరుపతి,డోలకల సంతోష్ కుమార్,,బుచ్చిబాబుతదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube