శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారి కూడలిలో శనివారం రోజు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందడంతో వారి చిత్రపటానికి మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అంజాద్ అలీ ,టిపిసిసి ఫిషర్ మెన్ కార్యదర్శి మహేష్, పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎండి అంజాద్ అలీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా తమిళనాడు కర్ణాటక గవర్నర్గా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా సుదీర్ఘకాలం పాటు ఆర్థిక శాఖ మంత్రిగా విద్య వైద్యం సాగు తాగునీటికీ నిరుపేదలకు ఉద్యోగులకు నిరుద్యోగులకు మహిళలకు రైతులకు పెద్ద పీట వేసి సహాయపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మహనీయుడని వారు మృతి చెందిన బాధాకరమని వారి మరణం కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని వారి సేవలను కొనియాడుతూ శ్రద్ధాంజలి జరిగింది ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షుడు సత్యశిల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆవుల రాఘవేంద్ర ,రవీందర్ రెడ్డి, అశోక్, రసూల్, లియాకత్, రాజు, బాలకృష్ణన్న కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube