ఆశ కార్యకర్తలకు సన్మానం

0
TMedia (Telugu News) :

ఈ మీడియా డిసెంబర్ 14 వనపర్తి : వనపర్తి పట్టణంలో 32వ వార్డులోని ఆశ కార్యకర్తలు కవిత,మాధవిలకు వార్డ్ కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కరోన సమయంలో కరోను లెక్కచేయకుండా వార్డ్లో ఇల్లులు తిరుగుతూ ప్రాణాలకు తెగించి ఇంటికి పోయి మెడికల్ కిట్టు ఇచ్చుకుంటూ ఎవరికైతే కరోన వచ్చినదో వాళ్ళ ఇంటిదగ్గరికి పోయి హాస్పిటల్ పంపించడం జరిగింది. అంత సహనంతో కష్టకాలంలో పని చేసినందుకు వార్డు కౌన్సిలర్ కేడిఆర్ నగర్ లోని జూమ్ పార్క్లో మంగళవారం ఘనంగా సన్మానం చేశారు. వార్డు తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ లు శ్రీదేవి, శైలజ ,ఆర్ పి శైలజ, సరస్వతి, సి ఓ వార్డ్ అధ్యక్షురాలు శారదమ్మ, భాగ్యమ్మ, స్పెషలాఫీసర్ యువరాజ్,డాక్టర్ దీన్ దయాల్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Asha workers in 32nd ward of Vanaparthi town paid homage to Kavitha and Madhavila by ward councilor Pendam Naganna Yadav.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube