టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 06
భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త న్యాయకోవిదుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రింగ్ రోడ్డు నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనం పై ఆయన చేసిన పోరాటం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మారువజాలము అని ఇప్పటికీ కూడా ఆ ఛాయలు కనబడుతున్నాయి అని రాజ్యాంగ రచించి దేశానికే దీక్షుచి అయ్యారు అని ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టం స్వామి దొర, నార్ల పాట శ్రీనివాసరావు, ఉదయ్, సురేష్, శ్రీనివాస రావు, పెంటయ్య, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.
