మాజీ మంత్రికి సన్మానం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 5 వనపర్తి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన కమిటీల్లో మాజీమంత్రి ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డికి తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా వనపర్తి జిల్లాలోని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇంటి దగ్గర చిన్నారెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి,ఎస్యుయుఐ నేషనల్ కోఆర్డినేటర్ త్రినాథ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి .వెంకటేష్ ,బాలరాజు, రాములు ,గణేష్ ,భాస్కర్ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి చిన్నారెడ్డి కి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Tribute to former minister.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube