బెస్ట్ కోవిడ్ కంట్రోల్ గ్రామపంచాయతీగా ఎంపిక
టీమీడియా,నవంబర్18,కరకగూడెం:
భారతదేశం తెలంగాణ రాష్ట్రంలోని పినపాక నియోజకవర్గ పరిధిలో ఏజెన్సీ కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది.బెస్ట్ కోవిడ్ కంట్రోల్ గ్రామపంచాయతీగా ఎంపిక చేయడం జరిగింది.
ఈ ఎంపికలో మొత్తం ఆరు గ్రామపంచాయతీలను ఎంపిక చేయగా
రాజస్థాన్-1,అస్సాం-2,మణిపూర్-1,ఉత్తరాఖం-1,తెలంగాణ-1(కన్నాయిగూడెం)ను ఈ విషయాన్ని నేరుగా సర్పంచుకు ఫోన్ ద్వారా మెయిల్ ద్వారా ఎన్ఐఆర్డిపీఆర్(నేషనల్ ఇన్స్టీటూ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్డ్ పంచాయత్ రాజ్) తెలియజేశారు.
ఎన్ఐఆర్డీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈ నెల 23,24 తేదిన హైద్రాబాద్ లో జరగబోయే వ్యవస్థాపక ఉత్సవాలలో పురస్కారాలను అందించి ప్రసంగించే అవకాశం సర్పంచ్ గారికి కల్పించారు.ఈ విషయం తెలుసుకున్న సర్పంచు ఎన్ఐఆర్డీ వారికి కోవిడ్ సమయంలో తమను వెనక వుండి నడిపించిన మండల,జిల్లా అధికార గణానికి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కన్నాయిగూడెం గ్రామపంచాయతీ భారతదేశంలోనే బెస్ట్ కోవిడ్ కంట్రోల్ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గానికి అధికారులకు ప్రజలకు వారు ప్రత్యేకంగా అభినందించారు.
