జయశంకర్ కు నివాళి

జయశంకర్ కు నివాళి

0
TMedia (Telugu News) :

జయశంకర్ కు నివాళి

టీమీడియా, ఆగస్టు 6, ఖమ్మం: నాలుగు కోట్ల మంది ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా దంసలాపురం సర్కిల్ వద్ద గల జయశంకర్ గారి విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ , కలెక్టర్ గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతీమా, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు , సుడా చైర్మన్ బచ్చు విజయ్, సీనియర్ నాయకులు ఆర్జేసి కృష్ణ గారు , 23 వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బూల్ గారు , ఉద్యమ కారులు బమ్మెర రామ్మూర్తి , సుడా డైరెక్టర్ ముక్తార్ గారు , కమర్థపు మురళి గారు , 23 వ డివిజన్ అధ్యక్షుడు షేక్ ఇలియాజ్ పాషా, కార్యదర్శి, నర్సింహారావు , ఆసీఫ్, సమీ తదితరులు వారికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు తెలిపారు.

 

Also Read : 9వ తేదీ వరకు భారీ వర్షాలు

 

అదేవిధంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి , మలి దశ ఉద్యమం లో వారు పోరాడిన నీళ్లు, నిధులు , నియామకాల గురించి తెలియజేశారు.ఈరోజు వారి యొక్క స్పూర్తి తో కేసీఆర్ తెలంగాణ సాధించి వారి ఆశయాలను సాధించడం కోసం కృషి చేస్తున్నారన్నారు.బంగారు తెలంగాణా సాధించడం లో కేసీఆర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube