జర్నలిస్ట్ మధుకు నివాళులు

జర్నలిస్ట్ మధుకు నివాళులు

1
TMedia (Telugu News) :

జర్నలిస్ట్ మధుకు నివాళులు

 

టి మీడియా,అక్టోబర్,20,మహబూబాబాద్ : కాజీపేట ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చిర్రా మధు గౌడ్ అనారోగ్యంతో మృతిచెందిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టుల తరపున జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వద్ద చిర్ర మధు గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్ట్ నేతలు చిత్తనూరి శ్రీనివాస్,పర్కాల రవీందర్ రెడ్డి,చిర్రగోని ఉదయ్ ధీర్ మాట్లాడుతూ అకాల మరణం చెందిన ఏబీఎన్ రిపోర్టర్ చిర్ర మధు గౌడ్ కు మహబూబాబాద్ జర్నలిస్టుల తరపున నివాళులు అర్పించామని,ప్రభుత్వం వెంటనే స్పందించి విధినిర్వహణలో వివిధ ఒడిదుడుకులు ఎదుర్కొని ఆటుపోట్లకు గురయ్యి కొంతమంది జర్నలిస్టులు అకాల మరణం చెందుతున్నారని, ఇలా మరణించిన ప్రతీ జర్నలిస్ట్ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయసహకారాలు అందించాలని,జర్నలిస్ట్ కుటుంబానికి ఆసరాగా ఉండి భరోసా అందించాలని,నిరంతరం ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకొని తక్షణసహయం అందించాలని, తాము కూడా యూనియన్ల పరంగా జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Also Read : పటాకుల గోదాంలో పేలుడు..

కార్యక్రమంలో జర్నలిస్టులు కల్లూరి ప్రభాకర్, కట్ల రాజు, శ్రీనివాసచారి, భిక్షపతి, చందూ,చుక్కల మధు, రంగా చౌదరీ, రాంప్రసాద్, వర్మ, గాడిపల్లి శ్రీహరి,యాదగిరి, రాధాకృష్ణ ,జీకే,సుబ్రహ్మణ్యం,పల్లె శ్రీనివాస్,జ్ఞానేందర్,రమేష్, కరుణాకర్ విష్ణు, యాకుబ్ పాషా,మహేష్,రామకృష్ణ రెడ్డి,, అశోక్,రవి, కిరణ్, మనోహర్, మోహన్,జీవన్, పవన్, అక్రమ్,సత్యం, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube