కాశీకి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

కాశీకి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

1
TMedia (Telugu News) :

కాశీకి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

టీ మీడియా. జూన్.22,చింతూరు:
మండలం లోని గొడ్లగుడెం గ్రామ సిపిఎం మాజీ శాఖ కార్యదర్శి కాశి రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు ఆయన మృతదేహానికి సిపిఎం చింతూరు సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకట్ మండల నాయకులు మన కం చిన్నయ్య పొడియం లక్ష్మణ్ గొల్లగూడెం లక్కవరం తులసి దాకా గ్రామ ప్రజలు నివాళులర్పించారు కాశీ మృతదేహంపై సిపిఎం జెండా కప్పి నివాళులర్పించారు అంతిమయాత్రలో పాల్గొని జోహార్ కాశి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మడకం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభ లో సిపిఎం సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కామ్రేడ్ కాశీ గారు తమిళనాడు ప్రాంతం నుండి ఇ చింతూరు మండలానికి వచ్చి గూడెం లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు అన్నారు కామ్రేడ్ బత్తుల భీష్మా రావు కామ్రేడ్ మడకం వెంకయ్యల సహచరత్వం తో ఆనాడు సిపిఎం పార్టీ చేసే పోరాటాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు వెదురు తునికాకు పార్టీ చేసే అనేక పోరాటాలలో స్వయంగా పాల్గొన్నాడు.

Also Read : మద్యం సేవించి వాహనాలు నడిపితే కటిన చర్యలు తప్పవు

వికలాంగుడైన ఈనాడు ఉద్యమ పథంలో తన వైకల్యాన్ని చేయకుండా పని చేశారు కిలోమీటర్ల తరబడి మామూలు మనుషుల తో సమానంగా నడిచే వారని అన్నారు కాశీ భార్య సిపిఎం కార్యకర్తలను నాయకులను ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చి పంపేవారు మోతుగూడెం గూడూరు లక్కవరం చింతూరు కి వెళ్లే రహదారి కి గొల్లగూడెం అడ్డరోడ్డు అడ్డా గా ఉండేది చిన్నపాటి కిరాణా కొట్టు నడుపుకుంటూ వచ్చే పోయే నాయకులకు కార్యకర్తలకు మన ఇల్లు కిరాణా కొట్టు సేద తీర్చుకోవడానికి పలకరింపుల కేంద్రబిందువుగా ఉండేది ఆ విధంగా గా కామ్రేడ్ కాశీ పార్టీ సభ్యుడిగా శాఖ కార్యదర్శిగా పని చేశారు 2 సంవత్సరాల క్రితం చేదోడు వాదోడుగా ఉండే భార్య చనిపోవడంతో మానసికంగా కొంత క్రుంగి పోయారు గత సంవత్సర కాలంగా ఆరోగ్యం తో బాధపడుతూ రాత్రి మృతి చెందారని అన్నారు ఈ సమావేశంలో లక్కవరం గ్రామ పటేళ్లు పూజారులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube