తాసిల్దార్ కు సన్మానం.
టీ మీడియా, ఆగస్టు 6 ,తిరుమలాయపాలెం:
బదిలీపై వెళ్తున్న తిరుమలాయపాలెం మండలం తాసిల్దార్ డి పుల్లయ్య ను డిప్యూటీ తాసిల్దార్ నరసింహారావు,ఆర్ఐ లహరి,మండల జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, ఎంపీపీ బోడా మంగీలాల్ తిరుమలాయపాలెం సర్పంచ్ కొండభాల వెంకటేశ్వర్లు, ఏలువారిగూడెం సర్పంచ్ దేవరం దేవేందర్ రెడ్డి, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ కే అజీజ్ జూనియర్ రికార్డు అసిస్టెంట్ ధరణి ఆపరేటర్, ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న అధికారులు వీఆర్ఏలు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ డీ పుల్లయ్య మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తోటి ఉద్యోగులు కలిసి చేసిన సేవలను గుర్తు చేశారు.తిరుమలయపాలెం ప్రాంత ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లడం ఎంతో బాధాకరమైన విషయమని కానీ విధి నిర్వహణలో తప్పకుండా ప్రభుత్వం ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెళ్లక తప్పదని వారు ఎక్కడున్నా తిరుమలాయపాలెం ప్రాంత ప్రజలపై ఆప్యాయత చిరకాల ఉంటుందని ఆయన గుర్తు చేశారు.