వైఎస్ రాజశేఖర్ రెడ్డి కినివాళి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కినివాళి

1
TMedia (Telugu News) :

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కినివాళి

టీ మీడియా, జులై8, మధిర:

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల ఆధ్వర్యంలో
పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్, జిలుగుమాడులో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం జిలుగుమాడులో పలుకుటుంబాలు పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం వసంతమ్మ సేవాసదనం,ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం కలకోటలోని కెఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో కిషోర్ కుమార్ చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు.

Also Read : పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ అందించిన సంక్షేమ పాలనను గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడూరు రమణారెడ్డి,దేవంభట్ల శ్రీనివాస్ శాస్త్రి,యన్నం కోటా రెడ్డి,దోర్నాల శ్రీను,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బలవంతపు రాజేష్,ఎర్రుపాలెం యూత్ కన్వీనర్ నలమోలు తిరుపతిరెడ్డి,మధిర సోషల్ మీడియా విభాగం నాయకుడు భరత్ సూర్య కార్యకర్తలు వేల్పులశేఖర్,లక్ష్మారెడ్డి,వీరేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube