ఐలమ్మ కు పలువురునివాళి

ఐలమ్మ కు పలువురునివాళి

1
TMedia (Telugu News) :
ఐలమ్మ కు పలువురునివాళి
టీ మీడియా,సెప్టెంబర్ 26, భద్రాద్రి కొత్తగూడెం:
వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించినభద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని కేంద్ర గ్రంధాలయంలో చాకలి ఐలమ్మ గారి 127 జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన… దిండిగాల రాజేందర్ . ఈ సందర్బముగా రాజేందర్ గారు మాట్లాడుతూ భూస్వాములు , దేశముఖ్లు చేసిన అకృత్యాలను ఎదిరించి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రేరణ కలిగించింది అన్నారు.

Also Read : భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం  

 

నాడు తెలంగాణ ఉద్యమాన్ని రైతాంగ సాయుధ పోరాటంగా మార్చిన చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చీర స్మరణీయమని అన్నారు, చాకలి ఐలమ్మ సాహసాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు, చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రేరణ కలిగించిందని, తెలంగాణ ఉద్యమాన్ని రైతంగా పోరాటంగా మార్చిందఅని తెలియజేశారు, భూస్వామ్య వ్యవస్థను కూల్చి దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాకలి ఐలమ్మ జయంతులు మరియు వర్ధంతులు నిర్వహిస్తూ తగిన గుర్తింపు కలిపించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది నవీన్ కుమార్ గ్రంథ పాలకురాండ్లు డీ వరలక్ష్మీదేవి జి మణి మృదుల గ్రంథాలయ పాఠకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube