మాజీ ఎమ్మెల్యే కు ఘన నివాళులు

మాజీ ఎమ్మెల్యే కు ఘన నివాళులు

1
TMedia (Telugu News) :

మాజీ ఎమ్మెల్యే కు ఘన నివాళులు

టీ మీడియా, నవంబర్ 15, వనపర్తి బ్యూరో : వనపర్తి బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టరు బాలకృష్ణయ్య 99వ జయంతి సందర్భంగా మంగళవారం ఏరియా హాస్పిటల్లో ఆయన విగ్రహం దగ్గర డాక్టర్ చైతన్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బాలకృష్ణయ్య వర్ధంతి ఆయన సహచరులు మిత్రులు, అఖిలపక్ష ఐక్యవేదిక డాక్టర్ బాలకృష్ణయ్య అభిమానులతో సహా పూజ చేసి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి పుట్టిన తర్వాత అతికొద్ది మంది డాక్టర్లలో డాక్టర్ బాలకృష్ణయ్య ప్రథముడని ఆయన సేవలు మరువలేనివని, పేదలకు ఉచితంగా సేవలు చేశాడని, అందుకే ఆయనను వనపర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ సందర్భంగా ఆయనను కొనియడారు.

Also Read : 121.5 మిలియ‌న్ల డాల‌ర్ల రిఫండ్ చెల్లించండి

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, డాక్టర్ బాలకృష్ణయ్య అభిమాన మిత్రులు, అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube