మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు

1
TMedia (Telugu News) :

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు

టీ మీడియా, నవంబర్ 20, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం భారతరత్న , మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 105వ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి వనపర్తి పట్టణంలో ఇంద్ర పార్క్ దగ్గర ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కిరణ్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య భారతదేశ నిర్మాణంలో శక్తి నారిగా మారి ప్రతిపక్ష నాయకుడు అటల్ వాజ్ పాయిచే కాలిక దేవిగా కీర్తించబడిన ఉక్కు మహిళ.

Also Read : అభిలాష్ రావు నీ రంగులు మార్చు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేద గుడిసెలను ఇల్లుగా చేసి పేదల బ్యాంకులను పెదపరం చేసి దేశ ఆర్థిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేసిన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ‌ ఇందిరమ్మ అని వనపర్తి పట్టణ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మధు గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా, భాస్కర్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, నాగరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా, మన్యం యాదవ్, గంధం లక్ష్మయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube