గద్దర్ కు నివాళులు
టీ మీడియా ,ఆగస్ట్ 7 ,నడిగూడెం :
ప్రజా యుద్ధనౌక ప్రజా తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజా గాయకుడు గద్దర్ అన్న అకాల మృతి చెందటం బాధాకరమని హమాలి సంఘం మండల అధ్యక్షుడు మల్లెల వెంకన్న, గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు
ఎ శ్రీరాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని హమాలీ సంఘం ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జానీ వెంకన్న తిరుపయ్య మహేష్ ముత్యాలు లక్ష్మయ్య హమాలీలు తదితరులు పాల్గొన్నారు.