ఎన్టీఆర్‌ కి కుటుంబసభ్యులు, ప్రముఖుల నివాళులు

ఎన్టీఆర్‌ కి కుటుంబసభ్యులు, ప్రముఖుల నివాళులు

0
TMedia (Telugu News) :

ఎన్టీఆర్‌ కి కుటుంబసభ్యులు, ప్రముఖుల నివాళులు

టీ మీడియా, జనవరి 18,హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు.. పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను స్మరించుకున్నారు.ఎన్టీఆర్​ ఘాట్ వద్ద​కు చేరుకున్న బాలకృష్ణ తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని తెలిపారు.

Also Read : కూలిన హెలికాప్ట‌ర్‌.. హోంశాఖ మంత్రితో పాటు 16 మంది మృతి

ఎంతోమందికి రాజకీయ ఓనమాలు నేర్పారన్న ఆయన.. ఎన్టీఆర్​ ఓ పొలిటికల్​ హీరో అని వ్యాఖ్యానించారు. పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదని.. ఒక వ్యవస్థ అన్న బాలకృష్ణ.. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube