టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 04
మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ కురువృద్దులు కొణిజేటి రోశయ్య మృతి కి మండల
కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఘన నివాళులు అర్పించారు.ఆర్ధిక మంత్రిగా,ముఖ్యమంత్రిగా,గవర్నర్ గా రోశయ్య ప్రజలకు ఎనలేని సేవలు అందించారని వారు తెలిపారు.కాగ్రెస్ పార్టీ కి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు
ఈ కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షులు మొగల్లపు చెన్నకేశవరావు,వగ్గేల పూజిత, బండారు మహేష్,సత్యవరపు బాలగంగాధర్,జల్లిపల్లి దేవరాజు,తుమ్మ రాంబాబు,బూసి పాండు,ముళ్ళుగిరి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బోగవేల్లి రాంబాబు,సీమకుర్తి వెంకటేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, లక్ష్మణ్,గుడివాడ కృష్ణ, ఉమామహేశ్వరరావు తదితరులు.
