కాంగ్రెస్ కార్యకర్త కు నివాళులు
టి మీడియా, డిసెంబరు 9, వనపర్తి బ్యూరో : ఆగారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త చంద్రం గౌడ్ గురువారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం గ్రామానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అయన ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు గంజాయి రమేష్, ఘనపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయకర్,అజిమ్, కాజా, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.