తెలంగాణ అమర వీరురాలికి ఘన నివాళులు
టీ మీడియా, జనవరి 18, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఓ ప్రైవేట్ కార్యాలయంలో తెలంగాణ కొరకు అమర వీరురాలు కావలి సువర్ణ స్మరిస్తూ ఆమె చిత్రపటానికి ఘనంగా పూలమాలవేసి ఈ సందర్భంగా వారు తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్.మండ్ల దేవన్ననాయుడు, వనపర్తి జిల్లా వాల్మీకి యువ నాయకులు. ఎల్లపు నరేష్ నాయుడు మాట్లాడుతూ. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ప్రాణాన్ని లెక్కచేయకుండా తెలంగాణ కోసం కొత్తకోట మండలం మీరా సి పల్లి గ్రామానికి చెందిన విద్యావంతురాలు కావలి సువర్ణ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మర్పణ చే సు కుందని గుర్తు చేశారు. మా వాల్మీకి బోయలకు ఎస్టీ జాబితా దక్కాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ కోసం ఉమ్మడి పాలమూరులో నలుగురు అమరులైనారు. మా వాల్మీకి బిడ్డలు మీరాసు పల్లి బోయ కావలి సువర్ణ,అచ్చంపేట శివ నాగులు,బోయ మల్లేష్, బోయ చెన్నయ్య ,వీరులకు జోహార్ జోహార్ నివాళులర్పించారు.
Also Read : స్లేట్ హై స్కూల్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవార్డులు
ఇప్పటికైనా మా వాల్మీకులను గుర్తించి 1956 ముందు మేము ఎస్టీలుగా ఉన్నాము మేము కొత్తగా గొంతెమ్మ కోర్కెలు అడగడం లేదు కెసిఆర్ ఇచ్చిన మాటను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం చేశామని చాలాసార్లు మాట ఇవ్వడం జరిగింది కేసీఆర్ వెంటనే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ డా : చెల్లప్ప కమిటీ ఆధారంగానే వాల్మీకి బోయలను ఎస్టీలుగా ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటుచేసి ఎస్టీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో. ఉందే కోటి అంజి, శంకర్ , అరవింద్ నాయుడు మండ్ల ,విజయ్ నాయుడు,నరేష్ నాయుడు వాల్మీకి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube