బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్‌ఎస్ ఆటంకాలు

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

1
TMedia (Telugu News) :

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్‌ఎస్ ఆటంకాలు -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
టీ మీడియా, జూలై 1,హైదరాబాద్: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.

Also Read : 60వేల మంది పోలీసులు 600 కెమెరాలు

ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామన్నారు. ఎనిమిదేళ్ళుగా మోదీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కార్యవర్గ సమావేశాలు ప్రజల‌ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మోదీ రాక కోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు ఒకేసారి రావటం అరుదైన సంఘటన అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube