నిత్యవసరాలుపంపిణీ చేసిన తెరాసా యువజన విభాగం

నిత్యవసరాలుపంపిణీ చేసిన తెరాసా యువజన విభాగం

1
TMedia (Telugu News) :

నిత్యవసరాలుపంపిణీ చేసిన తెరాసా యువజన విభాగం
టిమీడియా,జూలై25,భద్రాచలం:
టి ఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని యువజన విభాగం ఆధ్వర్యంలో “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం టిఆర్ఎస్ యువజన విభాగం శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాశీ నగరం గ్రామంలో సుమారు 150 కుటుంబాలకు లక్ష రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులు దుప్పట్లు మరియు పండ్లు బిస్కెట్లు, ప్రతి కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య మరియు శ్రేణులు ప్రతి కుటుంబ వద్దకు వెళ్లి నిత్యవసర సరుకులు అందజేసి అనుకోకుండా జరిగిన విపత్తులో భాగంగా వరద ప్రభావిత ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన కాశీ నగరం గ్రామస్తుల మధ్య రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, నీట మునిగిన కుటుంబాలు త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో వారికి సాయం చేసే దిశగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ, అభివృద్ధికి మార్గదర్శకుడుగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు త్వరగా కోలుకోవాలని ఆయన అన్నారు.

 

Also Read : ముంపు బాధితులను పట్టించుకోని పాలకులు

తీవ్ర వర్షాలతో వరదలు వచ్చి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందుతుందని దాతలు ముందుకు వచ్చి ఇంకా సాయం చేయాల్సిన అవసరం ఉందని, భద్రాచలం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తీసుకుని నిర్ణయం హర్షణీయమని దీని ద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భద్రాచల సీతారామాంజనేయ స్వామి కరుణ కటాక్షం ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస యోజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ ఉపాధ్యక్షులు బలుసు మురళీకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్లు షేక్ బాజీ బాబా మరియు బోజడ్ల దిలీప్,చిక్కుళ్ళ నాని, నల్లబెల్లి గౌతమ్ రహమత్ సంతోష్ అదేవిధంగా దుమ్ముగూడెం జడ్పిటిసి ఎంపీపీ కాశీనగరం సర్పంచ్ మరియు తదితరు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube