అభివృద్ది కి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి

అభివృద్ది కి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి

1
TMedia (Telugu News) :

అభివృద్ది కి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి

టీ మీడియా,అక్టోబర్ 28,మునుగోడు : నియోజకవర్గ అభివృద్ధికి నవంబర్ 3 న జరగనున్న నియోజక వర్గ శాసన సభ ఉప ఎన్నికల్లో వామపక్షాలు బలపరుస్తున్న టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ఆపార్టీ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ కోరారు.రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంచార్జి గా వ్యవహరిస్తున్న కొరిటికల్ గ్రామంలో కృష్ణ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకులు అభివృద్ధి కోసం పనిచేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఎం.ఎల్. ఎ.లను కొనుగోలు చేయడం వంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Also Read : దళితబంధు నిధులతో ఆదాయం సంపాదించుకోవాల

కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై పెంచిన జీఎస్ టి తగ్గించే వరకు ప్రతీ ఒక్కరూ లేఖలు రాయాలని పిలుపు నిచ్చారు.దీనితో పాటు ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తూ నిత్యావసరాల ధరలు పెంచుతున్న బిజేపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా టిఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపించాలని పిలుపు నిచ్చారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ తో పాటు పలు సంక్షేమ పదకాలను వివరిస్తూ కారు గుర్తుకి ఓటు వేసి టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు లతో పాటు మునుగోడు ప్రజా ప్రతినిధులు,ఖమ్మం ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube