ప్రజలకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అండ

పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్

1
TMedia (Telugu News) :

ప్రజలకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అండ

 

పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్

టీ మీడియా, నవంబర్ 3, రామకృష్ణాపూర్ : ఆపద లో ప్రజలకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రామకృష్ణాపూర్ టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి లతో కలిసి బాధితులకు 73 వేల రూపాయల సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను అందజేశారు. నాలుగో వార్డ్ కు చెందిన నరెడ్ల తిరుపతి ప్రమాద వశాత్తు గాయపడి ప్రై వేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఖర్చుల పాలయ్యాడు.21 వ వార్డ్ కు చెందిన గాడిచర్ల కనకయ్య ప్రమాద వశాత్తు గాయపడి ప్రయివేటు దవాఖాన లో వైద్య సేవలు పొందారు.

 

Also Read : భారత్‌కు వాయు కాలుష్యమే పెద్ద సమస్య : గడ్కరీ

 

విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎం.ఎల్.ఏ బాల్కసుమన్ చొరవ తో తిరుపతి కి 13000, కనకయ్య కు 60వెల రూపాయల విలువ గల చెక్ లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే,అనారోగ్యా నికి,ప్రమాదాలకు గురైన వారికి వైద్య ఖర్చులను అందించి ఆదుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు జాడి శ్రీనివాస్,పొగుల మల్లయ్య,రెవెళ్లి ఓదెలు, పార్వతి విజయ లు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube